Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరల్డ్ కప్ ఫైనల్ చూస్తూ ఒత్తిడి తట్టుకోలేక కివీస్ ప్లేయర్ చిన్ననాటి కోచ్ మృతి

  • నీషామ్ కోచ్ డేవ్ గోర్డాన్ హఠాన్మరణం
  • నీషామ్ సిక్స్ కొట్టడంతో ఉద్వేగానికి లోనైన గోర్డాన్
  • గురువు మృతికి విచారం వ్యక్తం చేసిన నీషామ్
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ నిస్సందేహంగా చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. చివరి బంతి వరకు హోరాహోరీ సాగిన పోరు సూపర్ ఓవర్ కు దారితీయగా, తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ చూస్తూ న్యూజిలాండ్ కు చెందిన డేవ్ గోర్డాన్ అనే హైస్కూల్ క్రికెట్ కోచ్ ప్రాణాలు వదిలాడు. కివీస్ జట్టులో యువ ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకున్న జిమ్మీ నీషామ్ కు గోర్డాన్ బాల్యంలో క్రికెట్ ఓనమాలు నేర్పించాడు.

ఫైనల్లో నీషామ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్ కొట్టగా, ఆ ఉద్వేగం భరించలేక గోర్డాన్ మరణించాడు. దీనిపై ఆయన కుమార్తె లియోనీ మీడియాకు తెలుపగా, నీషామ్ ట్వీట్ చేశాడు. గోర్డాన్... నీషామ్ కు మాత్రమే కాకుండా ఎక్స్ ప్రెస్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు. తనకు గోర్డాన్ గురువు మాత్రమే కాదని, మంచి స్నేహితుడు కూడా అని నీషామ్ విచారం వ్యక్తం చేశాడు. గోర్డాన్ క్రికెట్ ను ఎంతగానో ప్రేమిస్తాడని, అలాంటి వ్యక్తి వద్ద క్రికెట్ నేర్చుకోవడాన్ని వరంలా భావిస్తానని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
Neesham
David Gordon
New Zealand

More Telugu News